నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తవక్లాపూర్ గ్రామంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంట పొలాలు నీట మునిగాయి. మరికొన్నిచోట్ల పత్తి చేలలో వర్షపు నీరు చేరి పత్తి చేలు ఎర్రబారి పూత రాలిపోతుందని, దీనివల్ల దిగుబడి తగ్గుతుందని పత్తి రైతులు సోమవారం మధ్యాహ్నం ఆవేదన వ్యక్తం చేశారు.