తలకొండపల్లిలో నకిలీ మెసేజ్ చూపించి కిరాణా దుకాణం నుంచి రూ.2,000 కాజేసిన ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నిందితులు చుక్కాపూర్ గ్రామానికి చెందిన మహేశ్, నాని, ఆమనగల్లుకు చెందిన పవన్ అని తెలిపారు. వీరు కొన్ని రోజులుగా గూగుల్ పేలో ఫేక్ ట్రాన్సాక్షన్ చూపించి, కిరాణా దుకాణాల యజమానులను మోసం చేసినట్లు వివరించారు