సంగారెడ్డి జిల్లా హత్నూరం మండలంలోని షేర్ ఖాన్ పల్లి రొయ్యపల్లి కాగాజుమద్దూర్ రోడ్డు బాగు చేయాలని కోరుతూ బిజెపి మండల అధ్యక్షులు నాగప్రరువు కూడా ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీవో శంకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాప గారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం వల్ల బస్సులు తిరగలేకపోతున్నాయని తద్వారా విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఆఫీసర్లు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్, బిజెపి నాయకులు పాల్గొన్నారు