కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు సోమవారం ఇబ్బందులు పడ్డారు. తిమ్మాపూర్ మండలంలోని సొసైటీల వద్ద రైతులు బారులు తేరి యూరియా అందకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. సైదాపూర్ మండలంలోని గ్రామాలలో కూడా రైతులకు సరిపడా యూరియా అందలేదు. అలాగే చిగురుమామిడి మండలంలో సొసైటీల వద్ద భారీగా జనం చేరుకోవడంతో పోలీసు బందోబస్తు నిర్వహించారు. చొప్పదండి మండలంలోని సొసైటీల వద్ద అధికారులతో రైతులు గొడవ పెట్టుకున్నారు. మొత్తానికి రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు ధర్నాలు, అధికారులతో వాగ్వాదం, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.