కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక పనిచేస్తుందని ఆరోపిస్తూ ప్రధాన రహదారిపై శనివారం ధర్నా చేశారు.ఈ ధర్నా కాస్త పోలీసులు కార్యకర్తలకు తోపులాటకు దారి తీసింది.మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ ఎరువుల విషయంలో రైతులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందేనని, రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో విఫలం అయ్యాయని అంజయ్య మండిపడ్డారు. రైతులు తెల్లవారక ముందే యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తే, ఒక బస్తా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పోలీసులకు కార్యకర్తలకు తోపులాట మధ్య అరెస్టు చేశారు.