గర్భిణీలు,బాలింతలకు ఆరోగ్య జాగ్రత్తలు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిల్కారి కాల్స్ గురించి విస్తృత ప్రచారం గావించాలని డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని కోరారు. శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి ఆశ నోడల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్భం దాల్చిన నాలుగు నెలల నుండి బిడ్డ పుట్టిన సంవత్సరం వరకు గర్భిణీలకు ఈ కాల్స్ వస్తాయన్నారు.అందువల్ల ఆశ వర్కర్లు ప్రతి గర్భిణీ కిల్కారి కాల్ నెంబర్ తమ మొబైల్ లో సేవ్ చేసుకునే విధంగా చూడాలన్నారు.