స్వచ్ఛమిత్ర కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం వారి అకౌంట్లోనే వేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ డిమాండ్ చేశారు.. మంగళవారం పాత కొత్తగూడెం పాఠశాల ఎంఈఓ కార్యాలయం ముందు స్వచ్ఛ మిత్ర కార్మికులు ధర్నా నిర్వహించారు.అనంతరం సమస్యలతో కూడిన ప్రతి పత్రాన్ని సంబంధిత అధికారికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ మాట్లాడారు..