శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని చిలమత్తూరులో దుండగుల దాడిలో గాయపడి హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డిని హిందూపురం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త దీపిక పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని మహిళల పైన వైఎస్ఆర్సిపి నేతల పైన దాడులు పెరిగిపోయాయి అని గతంలో బాబు రెడ్డి అనే టిడిపి నాయకుడు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి పై దాడి చేసినప్పుడు అతనిని అరెస్టు చేయలేదని అతని అరెస్టు చేసి ఉంటే ఈరోజు మరల దాడికి పాల్పడి ఉండేవాడు కాదని తెలిపారు.