జులూరుపాడు మండలం జులూరుపాడులో సీతారామ ప్రాజెక్టు ద్వారా మండల రైతులకు సాగునీరు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇల్లు, పెన్షన్ లు ఇవ్వాలని తదితర డిమాండ్ల తో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించి అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ..... రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండల కేంద్రాల్లో స్థానిక సమస్యలపై పోరాటాలు చేస్తున్న దానిలో భాగంగా మండలం లో రైతులకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.