బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ యూరియా సరఫరా పై ఫోకస్ పెట్టారు.శనివారం పదవీబాధ్యతలు స్వీకరించగానే బాపట్ల లోని మార్క్ ఫెడ్ గోడౌన్ లో యూరియా నిల్వలను పరిశీలించారు.జిల్లాకు యూరియా ఎంత వచ్చింది,సొసైటీలకు ఎంత పంపింది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.రైతులకు సమృద్ధిగా యూరియా అందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిరోజూ నిల్వలపై సమీక్షలు జరపాలని ఆదేశించారు.రైతులు ఫిర్యాదులు చేయడానికి వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటించారు.తదుపరి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు.