ఫార్మా సిటీ కోసం రైతులు ఇచ్చిన భూములకు బదులుగా ప్రభుత్వం కేటాయించిన భూములను కొందరు రియాల్టర్ లు నోటరీ ద్వారా తక్కువ ధరలకే రైతులనుంచి కొనుగోలు చేస్తున్నారు అని మండి పడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నేడు రైతులకు కేటాయించిన భూములను పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి రైతులు ఎవరూ భూములు అమ్ముకో వద్దని సూచించారు