నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, వీర్లపాలెం లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం స్థానిక బస్టాండ్ వద్ద బయట నుంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్లాంటు ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు. పదేళ్లు దాటిన ఇప్పటివరకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. భూ నిర్వాసితులకే కాకుండా స్థానికులకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.