రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను నియంత్రించడానికి రజక సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తో సోమవారం రజకులు గుంటూరు కలెక్టరేట్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తమకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాలని, తమపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని రజక వృత్తిదారుల సంఘ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడారు.