తమ కోసం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలని విభిన్న ప్రతిభావంతులు విజ్ఞప్తి చేశారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన పీజీ ఆర్ఎస్లో వారు వినతిపత్రం అందించి మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం నెలలో ఒకసారి అధికారులు తమతో సమావేశాన్ని నిర్వహించాలన్నారు. అదేవిధంగా గ్రీవెన్స్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విభిన్న ప్రతిభవంతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు కృషి చేయాలి అన్నారు.