నర్సంపేటలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురిజాల, నర్సంపేట మధ్య ఉన్న కాజ్వే పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురిజాల, లింగాపురం వెళ్లాల్సిన ప్రజలు గిర్నిబావి మీదుగా ప్రయాణిస్తున్నారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నందున చేపల వేటకు వెళ్లవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.