నల్గొండ జిల్లా, చిట్యాల పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డిఎస్పి శివరాంరెడ్డి పాల్గొని మాట్లాడారు.. ఏపీ, ఒడిస్సా నుండి అక్రమంగా గంజాయిని ఢిల్లీకి తరలిస్తుండగా ఏడుగురు సభ్యుల అంతర్రాష్ట్ర గంజాయి ముఠాని పట్టుకొగా ఆరుగురు పరారీ కావడంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి రూ.65 లక్షల విలువ చేసే 250 కేజీల గంజాయితో పాటు రెండు కార్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి ముఠా నువ్వు పట్టుకున్న పోలీసులను అభినందించారు.