వెలుగోడు పట్టణంలో బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ, హిందు భక్తులు పోలీస్ స్టేషన్ ఏదుట ధర్నా చేపట్టారు. శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రను అడ్డుకొని మహిళలపై చేయి చేసుకున్న పోలీసులను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు.వినాయక చవితి పండుగ సందర్భంగా తాము ప్రతిష్టించి నిమజ్జనం చేసేందుకు శోభాయాత్రలో తీసుకువెళ్తున్న గణేష్ విగ్రహాలను తమ అనుమతి లేకుండా తీసుకెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తు శనివారం పోలీస్ స్టేషన్ ఎదుట ఐదు గంటలకు నిరసన చేపట్టారు.