కమ్మర్పల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. విసిగివేసారిన పారిశుధ్య కార్మికులు వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని మా పేద బ్రతుకులకు రెండు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే పోతే బ్రతకడం ఎలా అని అధికారులను ప్రశ్నించారు. తమకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు.