సంగారెడ్డి మున్సిపాలిటీలో వందరోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కమిషనర్ ఈనెల 30వ తేదీ వరకు వందరోజుల ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు తడి, పొడి చెత్తను ఇంట్లోనే వేర్వేరుగా చేసుకొని చెత్త బండిలో వేయాలని సూచించారు. రోడ్డుపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.