అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆదర్శనగర్ లో మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఆటో డ్రైవర్ బాబు ఇంటి మెయిన్ డోర్ ను పగలగొట్టి చోరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం 9:30 గంటల సమయంలో ఇంటి యజమాని ఆటో డ్రైవర్ బాబు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా ఆదర్శనగర్లో నివాసం ఉన్నానని నిన్నటి రోజున రామగిరి గ్రామానికి సొంత పనిమీద కుటుంబ సభ్యులతో వెళ్లడం జరిగిందని అయితే దొంగలు ఇంటి మెయిన్ డోర్ నే పగలగొట్టి 8 తులాల బంగారు 40,000 నగదును ఎత్తుకెళ్లడం జరిగిందని ఈ సంఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తమకు న్యాయం చేయాలని ఇంటి యజమాని ఆటో డ్రైవర్ బాబు పేర్కొన్నారు.