ధర్మవరం చెరువులో సోమవారం ఉదయం ఈత కోసం వెళ్లి బత్తల మహేష్ (35) అనే యువకుడు గల్లంతయ్యాడు.ధర్మవరం అగ్నిమాపక శాఖ అధికారి నర్సింహులు ఆధ్వర్యంలో సిబ్బంది గల్లంతైన చోట ప్రత్యేక పరికరాలతో గాలించి మృతదేహాన్ని చెరువులో నుండి బయటకు తీశారు. అనంతరం రెవిన్యూ అధికారులు పరిశీలించి ధర్మవరం మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.