బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ ను ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమలరావు శుక్రవారం సందర్శించారు. ఆయన ఆర్టీసీ డిపో గ్యారేజీ, కొత్త బస్టాండ్ ను పరిశీలించి, బస్టాండ్లో వసతుల కల్పనకు కృషి చేయాలని మేనేజర్ను ఆదేశించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆయన పరిశీలించి, ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే మహిళా ప్రయాణికులను వసతులపై అడిగి తెలుసుకున్నారు.