ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుడు గూళ్ళ లింగం లావణ్య ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మొదటి దశలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇంటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, చాలా చోట్ల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు.