నల్గొండ జిల్లా, దేవరకొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని చెన్నారం ఎక్స్ రోడ్ సమీపంలో నాటు సారాకు ఉపయోగించే నల్ల బెల్లం, పటికను పెద్ద ఎత్తున పట్టుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నారం ఎక్స్ రోడ్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 6000 కిలోల నల్ల బెల్లం, 100 కిలోల పటికను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.