కాసిపేట మండలం దేవపూర్ గ్రామంలోని దళితవాడలో సిసి రోడ్డు వేయాలని మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అటకపురం రమేష్ మాట్లాడుతూ దళితవాడలో గత 10 ఏళ్లుగా రోడ్డు లేక వర్షం పడితే బురద దారిలో నడవలేక చిన్నపిల్లలకు పెద్దలకు ఇబ్బందిగా మారిందన్నారు వెంటనే ఎమ్మెల్యే గడ్డ వినోద్ స్పందించి దళితవాడలో రోడ్డు వేయాలని కోరారు