చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేటముంచుతోందని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు ధ్వజమెత్తారుశుక్రవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేతకానితనం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.యూరియా దొరక్క రైతుల అనేక పాట్లుపడుతున్నారన్నారు. బాపట్ల జిల్లాలో పరిస్థితి మరి అధ్వానంగా ఉందని వారు పేర్కొన్నారు.రైతు సమస్యలపై పోరాడతామన్నారు.