అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 4వ వార్డులో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. పామిడి 4వ వార్డుకు చెందిన బందేల దావీదు, గుడిచి లక్ష్మీదేవిలు గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో బాధ పడుతూ గంటల వ్యవధిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు చెన్నకేశవ రెడ్డి, ఈశ్వర రెడ్డిలు మృతదేహాలను సందర్శించి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.