వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కేంద్రంలో మహిళా కారగారంలోని ఖైదీ సుచరిత మృతికి జైలు సూపరిండెంట్ కారణమని ఆమెను సస్పెండ్ చేయాలంటూ శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు నిరసనకు దిగారు సుచరిత కుటుంబ సభ్యులు మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు. నర్సంపేట పట్టణానికి చెందిన సుచరిత మృతికి జైలు సుపరిండంటే కారణమని ఆమె ఆరోగ్యం క్షమించినప్పటికీ తమకు సమాచారం అందించకుండా ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారని చనిపోయాక తమకు సమాచారం అందించారని అప్పటివరకు సమాచారం అందించకుండా మృతికి కారణమైన సూపరిండెంట్ పై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. సుచరిత మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలన్నారు.