ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ - బొగ్గు గుడిసె వద్ద బుధవారం కళ్యాణి వాగులో భారీ వర్షాలకు వాగు పొంగడంతో ఇరుక్కుపోయిన 8 మందిలో 5 గురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అక్కడికి చేరుకొని ఫైర్, రిస్క్యూ బృందంతో కలిసి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై జిల్లా ఎస్పీతో మాట్లాడారు. అలాగే అన్నాసాగర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో పనుల్లో భాగంగా అక్కడ బిహారీ కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఇది వరకే నలుగురిని కాపాడగా, తాజాగా మరో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందాలు ఒడ్డుకు చేర్చారు.