శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్యలతో కలిసి అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో భాగంగా మూడు బెంచ్ లను ఏర్పాటు చేసి 95 కేసులను పరిష్కరించారు. 2 క్రిమినల్ అప్పీళ్ల ద్వారా బాధితుడికి రూ. 4 లక్షలు అందజేశారు. అదే విధంగా రూ.29,90,000 వ్యయం చేసే 8 సివిల్ కేసులను పరిష్కరించారు. 6 చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించి బాధితులకు రూ.48,90,000 ఇప్పించారు.ఒక డీవీసీ కేసు ద్వారా బాధితురాలికి రూ.5 లక్షలు అందజేశారు. దీనికి తోడు 59 మద్యం కేసులకు అపరాధ రుసు