బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండలం లోని తడపాకల్, గుమ్మిర్యాల్, దొంచంద గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. గోదావరి నది వరద ఉధృతికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం కల్పించారు. త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన వ్యవసాయ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు