అనకాపల్లిలో మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం చేపట్టారు. రైతులకు సరిపడ యూరియా అందించడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపట్టిన ర్యాలీ రింగ్ రోడ్డులో గల వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ర్యాలీ ప్రారంభించారు. రైతులకు యూరియా అందించాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు.