వరుసగా కురిసిన అధిక వర్షాల వలన నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ప్రాజెక్టు కెపాసిటీకి మించి వరద నీరు రావడంతో కోతకు గురైన ప్రాజెక్ట్ ఆనకట్టకు జరుగుతున్న పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం 70 వేల క్యూసెక్కుల కెపాసిటీతో నిర్మించిన ఈ పోచారం ప్రాజెక్టులోకి ఈనెల 27వ తేదీన 1.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఆనకట్ట కొంచెం దెబ్బతిన్నదని అన్నారు. అలాగే వరద నీరు తగ్గిన తర్వాత ప్రాజెక్టు పర్మనెంట్ రిపేరు పనులను చేపడతామని తెలిపారు.