మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తన తల్లి మృతి చెందిందని ఆరోపిస్తూ సతీష్ అనే యువకుడు శనివారం ఆసుపత్రి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకుండా కేసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలూ సేవలు అందించాలని అతను డిమాండ్ చేశాడు. గతంలో తన తల్లి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వస్తే సరైన వైద్యం అందక, మహబూబాబాద్కు తరలించినా ఫలితం లేక చనిపోయిందని తెలిపాడు.