అనంతపురం జిల్లా వజ్రకరూరు సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన రోడ్డు ప్రమాదంలో బాబా ఫక్రుద్దీన్,నజీర్లు మృతి చెందగా ఫరూక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని వజ్రకరూరు ఎస్సై నాగ స్వామి ఆదివారం పేర్కొన్నారు. పామిడి గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ కు ఇటీవల కూతురు జన్మించడంతో ఉరవకొండకు తన ఇద్దరు మిత్రులతో కలిసి వచ్చి కూతురిని చూసుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.