మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఎదుట శుక్రవారం ఉదయం 10:00 లకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి తమని క్రమబద్ధీకరించాలంటూ విధులు బహిష్కరించి సమ్మెను చేపట్టారు.. ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి జీవో నెంబర్ 64 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగులు అంతా కలిసి సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.