చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఐలమ్మ చిత్రపటానికి MLA మహిపాల్ రెడ్డి బుధవారం పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. గడీలపై గలమెత్తి తెలంగాణ రాష్ట్రంలో భూ పోరాటానికి నాంది పలికి మహిళా చైతన్యానికి ప్రత్యేకగా నిలిచిన ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు . ఐలమ్మ పేరును హైదరాబాదులోని మహిళా విశ్వవిద్యాలయానికి నామకరణం చేశారని గుర్తు చేశారు. వారి వారసులకు సైతం సముచిత గౌరవం కల్పించారన్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల అనంతరం సాకి చెరువు కట్టపై అతి త్వరలో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపార.