నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం, ఇనుపాముల గ్రామంలోని బస్టాండ్ వద్ద ఉన్న అండర్పాస్ లోకి భారీగా వరద ప్రవాహం చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం సాయంత్రం వాహనదారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇనుపాముల గ్రామంలోని ఏఎంఆర్పి ఉపకాలవ కల్వర్టు ధ్వంసం కావడంతో వరద ప్రవాహం చేరి ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.