హిందూపురం పట్టణంలోని మేలాపురం తెలుగు తల్లి సర్కిల్లో తెలుగు భాషా దినోత్సవం నాడు తెలుగు తల్లి విగ్రహానికి ఓ పూలమాలవేసి తెలుగు తల్లినీ గౌరవించడం కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీ సభ్యులు మర్చిపోయారు. విగ్రహం ఏర్పాటు చేసి తెలుగు తల్లి సర్కిల్ అని ఏర్పాటు చేయడం తెలుగు భాష పై తమకే మక్కువ బాధ్యత ఉన్నట్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముందు చూపించుకోవడానికి మాత్రమే ఈ విగ్రహం ఏర్పాటు చేశారని కనీసం తెలుగు భాషా దినోత్సవం రోజున విగ్రహానికి పూలవల వేయడం తెలియదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.