నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం లో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, ధర్పల్లి, మోపాల్ మండలాల్లో వర్షపు నీరు భారీగా ప్రవహించింది. దీంతో సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయిలో భారీగా నష్టం పట్టింది. పలుచోట్ల ఇండ్లు దెబ్బతినగా, రోడ్లు కొట్టుకుపోయాయి, వందల ఎకరాల్లో పంట నష్టపోయింది. దీంతో రైతన్నలు ఇటు గ్రామస్తులు, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.