రంగారెడ్డి మణికొండ అల్కపూరి కాలనీ లో హైడ్రా దూకుడు . అనుహార్ అపార్ట్‌మెంట్ లో కమర్షియల్ షెట్టర్స్ ను తొలగించారు అధికారులు. రెసిడెన్షియల్ గా అనుమతులు తీసుకొని కమర్షియల్ గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడం తో విచారణ జరిపారు హైడ్రా అధికారులు. వారం క్రితం స్పాట్ విజిట్ చేసారు హైడ్రా కమీషనర్ రంగనాథ్. హైడ్రా కమీషనర్ అదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలను కూల్చి వేశారు అధికారులు