ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో ఉధృతంగా ప్రవహించిన వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. వర్షాలు తగ్గడంతో లంక గ్రామాల ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. కోడేరు, పెదమల్లం, భీమలాపురం, కరుగోరుమిల్లి పుష్కరఘాట్లు వరద ప్రభావం నుంచి క్రమంగా తేరుకుంటున్నాయి. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద మళ్లీ ఉధృతం అయ్యే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.