అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరుపు రంగారావు మాట్లాడుతూ.. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, పనిభారాలు తగ్గించాలని 5g సెల్ ఫోన్లు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.