ఆత్రేయపురం మండలం రాజవరం ఎస్సీ పేటకు చెందిన తొర్లపాటి రాజేంద్ర అదే పేటకు చెందిన తాడేపల్లి సురేశ్ పై పాత కక్షలతో దాడి చేశాడు. దాడిలో గాయపడిన సురేశ్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు రాజేంద్రను అరెస్టు చేసి కొత్తపేట కోర్టుకు తరలించగా, కోర్టు రిమాండ్ విధించిందని ఎస్ఐ శ్రీనివాస్ సోమవారం తెలిపారు.