శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద హిందూపురం నియోజకవర్గంలో 41 మంది లబ్ధిదారులకు రూ. 35 లక్షల రూపాయల విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యంతో హిందూపురంలో పేద ప్రజలు చికిత్సలు చేయించుకుని ఇబ్బందులు పడుతున్నారని సమాచారం తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి తిరిగి ఖర్చుపెట్టిన నగదును ఇలా ఎమ్మెల్యే సహాయంతో అందజేయడం జరుగుతుందని తెలిపారు.