మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గతంలో రైతులు చేపట్టిన ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరో ఉద్యమాన్ని చేపడతామన్నారు. నాయకులు బండి దత్తాతడి వెంకటనారాయణ, కిరణ్, సచిన్, గణేశ్ తదితరులు ఉన్నారు.