నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం కలసట్ల గ్రామ శివారులో శనివారం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడి చెన్నకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని కనకపురకు చెందిన చెన్నకృష్ణ గ్రామాల్లో తిరుగుతూ రైతులకు ఉపయోగపడే టార్పాలిన్లు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో కలసట్ల గ్రామానికి వెళ్తూ బైక్ అదుపు తప్పి బోల్తా పడి గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.