ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యూరు మండలంలోని రత్నంపేట, పాడి గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయిందని స్థానికులు బుధవారం తెలిపారు. దీంతో సుమారు 7 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు కొండవాగు ఉప్పొంగడంతో వంతెన కొట్టుకుపోయి, తూరలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, కొండవాగుపై వంతెన నిర్మించాలని స్థానికులు చెబుతున్నారు.