అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని జామియా మసీదు వద్ద జామియా తాసిరియా ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మతగురువు సయ్యద్ అజ్మతుల్లా హుసేని వారి ఆశీస్సులతో చారిటబుల్ సొసైటీ చైర్మన్ సయ్యద్ తాసిర్ బాబా ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త సోల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించామని చారిటబుల్ సొసైటీ చైర్మన్ సయ్యద్ తాసిర్ బాబా పేర్కొన్నారు. మొత్తం 207 మంది విద్యార్థినీ విద్యార్థులు సెప్టెంబర్ 5,6 మిలాద్ ఉన్ నబీ ఉత్సవాల్లో బహుమతులు పంపిణీ చేస్తామన్నారు.