నల్గొండ జిల్లా, మాడుగుల పల్లి మండలం, పాములపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టిన యూనిఫామ్స్ ను ఏపిఎం భాషపాక చంద్రశేఖర్ బుధవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా సంఘాలకు జీవనోపాధి కల్పించేందుకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పనిని అప్పగించిందని, వాటిని వారు నాణ్యతతో పుట్టారని తెలిపారు. రేపటినుండి పాఠశాలలు తెచ్చుకొనుడడంతో ఈరోజే వాటిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు.